సాయంకాలం బడి ప్రారంభం

సాయంకాలం బడి ప్రారంభం

NLR: ఓబులాయపల్లిలో భారతీయ మహాసేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే సాయంకాలం బడి సోమవారం నుంచి ప్రారంభమైంది. చింతల జాషువా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత విద్య, ఆటలు-పాటలు, డ్రాయింగ్ బోధన అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బడి రోజు సాయంత్ర 5-7 వరకు ఉంటుందన్నారు. అల్పాహారం పంపిణీ చేస్తామన్నారు.