చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే కఠిన చర్యలు: ఎమ్మెల్యే
SRD: చెరువుల్లోకి పరిశ్రమలు కాలుష్య జలాలు వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. పటాన్ చెరులో నీటిపారుదల శాఖ, పీసీబీ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు తమ పని విధానం మార్చుకోవాలని సూచించారు. కాలుష్యంతో ప్రజల ప్రాణాలు పోతుంటే మీకు పట్టింపు లేదా అని ప్రశ్నించారు.