మురుడి నుంచి తమ్మెపల్లి రహదారి పూర్తి
ATP: డీ.హీరేహల్ మురుడి నుంచి తమ్మెపల్లి గ్రామానికి వెళ్లే గుంతలమయమైన రహదారి పనులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పూర్తి చేయించారు. దాదాపు రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రహదారిని బుధవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ రహదారి పనులు పూర్తి కావడంతో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.