వర్షంతో ఇబ్బందులు ఏర్పడితే డయల్ యువర్ ఎమ్మెల్యే

WGL: భారీ వర్షాల దృష్ట్యా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రజలు అత్యవసరమైన సమయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 నంబరుకు కాల్ చేసి సహాయక చర్యలు పొందాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి, హసన్‌పర్తి మండలాలు, 13 డివిజన్‌ల పరిధిలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటామన్నారు.