రూ.351 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
BDK: భద్రాచలంలో సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతోంది. ఈ మహాత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై సీతారామచంద్రుల వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.