'ఎలక్షన్ కోడ్ ఉండగా ఇది పద్దతి కాదు'
WGL: నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. టౌన్‌లో తిరిగి నియోజకవర్గానికి నర్సంపేటలో రూ.1000 కోట్లు ఇస్తానని ఎలా అంటారని, ఎలక్షన్ కోడ్ ఉండగా ఇది పద్ధతి కాదన్నారు. సీఎం బోగస్ మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎలక్షన్ల కోసమే తిరుగుతున్నారని మండిపడ్డారు.