ముచ్చురామిలో మామిడి చెట్ల నరికివేత

ముచ్చురామిలో మామిడి చెట్ల నరికివేత

సత్యసాయి: ధర్మవరం మండలం ముచ్చురామిలో వైసీపీ కార్యకర్త రామ్మోహన్ రెడ్డికి చెందిన మామిడి తోట చెట్లను కూటమి నేతలు నరికివేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి బాధిత రైతు పొలాన్ని పరిశీలించి, రామ్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. రైతుకు పార్టీ అండగా ఉంటుందని, అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.