సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా
AKP: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం RDO కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ.. నిబంధనలు సడలించి ధాన్యం మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనతరం ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు.