జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష
ATP: జిల్లా అభివృద్ధి, సమస్యలపై CM చంద్రబాబు బుధవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కలెక్టర్ ఆనంద్ విజయవాడకు వెళ్లారు. గత రెండు రోజులు శాఖల వారీగా సాధించిన పురోగతిపై నివేదికలు సిద్ధం చేశారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు, ఉద్యానవన అభివృద్ధి, జలవనరుల వినియోగం వంటి ప్రధానాంశాలపై ప్రజాప్రతినిధులతో కలిసి చర్చించనున్నారు.