VIDEO: యర్రగొండపాలెంలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్

VIDEO: యర్రగొండపాలెంలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్

ప్రకాశం: యర్రగొండపాలెంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ శనివారం ఒక్కసారిగా పేలింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళన చెందారు. పిల్లలు పాఠశాలకు వెళ్తున్న సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలి మంటలు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.