VIDEO: కమలాపురంలో రెచ్చిపోతున్న బైక్ దొంగలు

KDP: కమలాపురం నగర పంచాయతీలో దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో, శనివారం అర్ధరాత్రి రెడ్డి కాలనీలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు బైకుల చోరీకి ప్రయత్నించారు. వారి చర్యలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇవాళ సూచనలను జారీ చేశారు.