ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: పామూరు మండలం దొడ్డ వెంకటపల్లిలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామికి పూజలు చేశారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.