VIDEO: ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవం
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తబైపురెడ్డిపాలెంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.