నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: భీమవరం 33/11 KV ఉపకేంద్రం పరిధిలో ఇవాళ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని EE వెంకటేశ్వరరావు తెలిపారు. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు నిమిత్తం చినరంగని పాలెం, భారతీయ విద్యా భవన్, రైతు బజార్, యామిజాల వారి వీధి ప్రాంతాలలో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు మార్పును గమనించి సహకరించాలన్నారు.