13న కాకినాడలో జాబ్ మేళా
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్లతో ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలన్నారు.