'చిన్నారులకు టీకాలు తప్పనిసరి'

NLR: మర్రిపాడు మండలం కంపసముద్రంలో నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సూపర్వైజర్ ఎం. తిరుపతమ్మ పరిశీలించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించి ప్రాణాంతక వ్యాధులను నివారించాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, శుక్రవారం 'ఫ్రైడే-ఫ్రైడే' కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె కోరారు. ఆమె వెంట సిబ్బంది పాల్గొన్నారు.