'ఏచూరి స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి'
SRD: సీతారం ఏచూరి స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం అన్నారు. సీతారం ఏచూరి 73వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు తరానికి ఏచూరి ఆదర్శమని పేర్కొన్నారు.