చర్లపల్లిలో యాక్సిడెంట్.. మరణించింది ఇతడే..!

మేడ్చల్: చర్లపల్లిలో జరిగిన ప్రమాదంలో పోలేపల్లి రఘునందన్ కుమారుడైన గౌతమ్ రాజ్(14) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల ప్రకారం.. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై గౌతమ్ వెళ్తుండగా అతివేగంగా దూసుకు వచ్చిన కారు డ్రైవర్ మైనర్ బాలుడిని ఢీకొట్టడంతో బాలుడి తలకి బలమైన గాయమై మరణించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.