రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MLG: కన్నాయిగూడెం సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం (రేపు) ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మతులు పూర్తవ్వగానే విద్యుత్ సరఫరా పునః ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.