రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
HYD: మలక్ పేట్‌లో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరికి గాయాలయ్యాయి. వాహనదారులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.