అంధుల పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్
సత్యసాయి: పట్టణ సమీపంలోని సేవా మందిర్‌లో ఉన్న బాల, బాలికల అంధుల ఆశ్రమ పాఠశాలలో అంధ విద్యార్థుల చేరికకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు ప్రిన్సిఫల్ రాజేశ్వరి తెలిపారు. 1నుంచి 10తరగతుల్లో 87 ఖాళీలు ఉన్నాయన్నారు. అన్ని వసతులతో ఉచితంగా విద్యా బోధన ఉంటుందని వివరించారు. జిల్లాలో అంధ విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు గుర్తించి ఆశ్రమ పాఠశాలో చేర్పించాలని ఆమె కోరారు.