VIDEO: గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద చెరువు వివాదం
సత్యసాయి: రొద్దం మండలం తురకలపట్నం నూతన మత్స్యకార సొసైటీ ఏర్పాటుపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌కు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద గురువారం రహస్యంగా స్కిల్ టెస్ట్ నిర్వహించారని ఆరోపించారు. కొద్ది కుటుంబాలకే సొసైటీ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, అర్హులైన మత్స్యకార కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.