VIDEO: పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎంపీడీవో
NZB: మెండోర మండలంలోని 6 కేంద్రాల్లో ఆదివారం 'ఉల్లాస్' అక్షరాస్యత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 299 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరైనట్లు ఎంపీడీవో లక్ష్మణ్ వెల్లడించారు. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట నర్సవ్వ, డీపీఎం రాజేశ్వర్ పాలుగోన్నారు.