కొమ్ములవంచకు ఆర్టీసీ బస్సు సేవలు పునరుద్ధరణ
MHBD: కొమ్ములవంచ గ్రామ ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ సహకారంతో తొర్రూర్ డిపో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించారు. ఈ బస్సు తొర్రూరు నుంచి కొమ్ములవంచ మీదుగా జయపురం వరకు రోజుకు రెండుసార్లు నడుస్తుందని డిపో మేనేజర్ తెలిపారు. ఈ సేవలు పునరుద్ధరణకు సహకరించిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దాసరాజు రాజశేఖర్, గ్రామ వార్డు సభ్యులు, కార్యకర్తలకు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.