ముదిగుబ్బ పీహెచ్‌సీకి రూ.1.69 కోట్ల నిధులు విడుదల

ముదిగుబ్బ పీహెచ్‌సీకి రూ.1.69 కోట్ల నిధులు విడుదల

సత్యసాయి: ముదిగుబ్బలో అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణ పనుల పూర్తి కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రూ. 1.69 కోట్ల నిధులు మంజూరు చేయించారు. 2018లో పనులు ప్రారంభమైనప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. మంత్రి ప్రత్యేక చొరవ చూపడంతో తాజాగా నిధులు విడుదలయ్యాయి.