వైసీపీ కార్యకర్తకు మాజీ మంత్రి పరామర్శ

ప్రకాశం: బల్లికురవ మండలం సోమవరప్పాడు గ్రామానికి చెందిన గోపిరాజు యాదవ్ సోమవారం TDP కార్యకర్తల దాడిలో గాయాలై అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో మంగళవారం మాజీ మంత్రి మేరుగ నాగార్జున వైద్యశాలకు వచ్చి గోపిరాజును పరామర్శించారు. పార్టీ పరంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలోఅద్దంకి నియోజకవర్గం YCP నాయకులు ఉన్నారు.