విశాఖలో మహిళా జన సున్వాయి ప్రారంభం
విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా జన సున్వాయి వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాధిత మహిళల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ వినతులు స్వీకరించి విచారణ నిర్వహించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ రామలక్ష్మి, అనకాపల్లి పీడీ సూర్యలక్ష్మి, ఏసీపీ నరసింహమూర్తి పాల్గొన్నారు.