VIDEO: మసీదులో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే
శ్రీకాకుళంలోని చారిత్రక కలిగిన జామియా మసీదును శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఆదివారం సందర్శించారు. ఈ మేరకు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం దానం, ధర్మానికి ప్రతీక అని అన్నారు. ముస్లింలు వారి సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.