రెండు నెలలుగా కోదాడ రూరల్ సీఐ పోస్ట్ ఖాళీ

రెండు నెలలుగా కోదాడ రూరల్ సీఐ పోస్ట్ ఖాళీ

SRPT: కోదాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పదవి రెండు నెలలుగా ఖాళీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో పనిచేసిన ప్రతాప్ లింగం సస్పెండ్ కావడంతో ప్రస్తుతం ఇంఛార్జ్ అధికారే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి సీఐ లేకపోవడంతో కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది. తక్షణమే శాశ్వత సీఐని నియమించాలి స్థానికులు కోరుతున్నారు.