నిడదవోలులో సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ
తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శనివారం నిడదవోలుకు విచ్చేశారు. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నందుకు నిడదవోలులో సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేష్, కూటమి ముఖ్య నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ బిల్లును వ్యతిరేకించి అడ్డుకున్నారు. మహిళా సాధికారతకు ద్రోహం చేస్తున్నారని సీఎం విమర్శించారు.