సింగిలా? డేటింగ్ అంటూ వలపు వల..!

HYD: సింగిల్‌గా ఉన్నారా? డేటింగ్ అంటూ కాల్స్ వస్తే స్పందించకండి. ఈ మాయల వల తెలియక ఎంతోమంది మోసపోయారు. వారి మాయ మాటలు నమ్మితే అంతే అంటున్నారు HYD పోలీసులు. మొదట నమ్మించి బుట్టలో వేసి, ఆ తర్వాత వేధిస్తారని యువకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతినెలా HYD పోలీసులకు కనీసం 12కు పైగా ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిపారు.