మహిళా నాయకురాలికి మంత్రి నివాళులు

మహిళా నాయకురాలికి మంత్రి నివాళులు

CTR: చిత్తూరుకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు శ్రీ దుర్గ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం ఆమె ఉత్తర క్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. దుర్గ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి, అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.