ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

BPT: పిట్టలవానిపాలెంలో చింతాడ ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చర్చి నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కల రామిరెడ్డి పై ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలని రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, మతం మారిన ఎస్సీ వ్యక్తికి అట్రాసిటీ చట్టం వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.