డ్రై ఫ్రూట్స్ అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి

డ్రై ఫ్రూట్స్ అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి

NLR: బద్దెవోలు గ్రామంలో ఉన్న శ్రీ కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు సురేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఉదయం కామాక్షి అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు. జీడిపప్పు, బాదంపప్పు డ్రై ఫ్రూట్స్‌తో అమ్మవారిని అందంగా అలంకరించారు. కుంకుమార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.