1677వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు నిరసన

1677వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు నిరసన

VSP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ GVMC గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్షా శుక్రవారం నాటికి 1677వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు ఆర్.ఎన్. మాధవి, కార్యదర్శి వై. సత్యవతి మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని జిల్లా వాసులకు పిలుపునిచ్చారు.