నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తో ఐదు గ్రామాలు జలదిగ్బందం

కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో జంగమయిపల్లి, రుద్రారం, మత్తమాల, ఆల్మజీపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లే దారిలో ఉన్న కాజ్వేపై వరద నీరు పోతుండటంతో ప్రజలు ఎల్లారెడ్డికి రాలేక ఇబ్బందులు, పడుతున్నారు.