పశు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు
PPM: మొంథా తుఫాను అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ పశుఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డా. మన్మథ రావు గురువారం తెలిపారు. జిల్లాలో అన్ని మండలాల్లో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 231 పశువుల ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. ఈ శిబిరాల ద్వారా మొత్తం 29,751పశువులకు చికిత్సలు చేశామన్నారు.