ఎటురునాగారంలో ఉచిత తాగునీటి శిబిరం ప్రారంభం
MLG: ఎటురునాగారంలో గుల్షన్-ఎ-ఫాతిమా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి శిబిరం ప్రారంభించారు. ఎక్స్ రోడ్ మస్జిద్-ఎ-ఖాద్రియా వద్ద ఎస్సై మహేష్ శిబిరాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.