ఫుట్ బాల్ పోటీలకు గేట్స్ కళాశాల విద్యార్థులు ఎంపిక
ATP: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్ బాల్ పోటీలకు గుత్తి గేట్స్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్ శ్రీవాణి సోమవారం తెలిపారు. కళాశాలలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు సాయి శ్రీనివాస్, ఫయాజ్‌లు వచ్చే నెలలో దేశవ్యాప్తంగా నిర్వహించబడే పోటీలకు ఎంపికయ్యారన్నారు.