సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి

HYD: ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్‌లో రూ.1.6 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దయార మార్కెట్ నుంచి సాగర్ లాల్ రోడ్డు రాజా డీలక్స్ వరకు ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.