VIDEO: అరవింద్ ఎవరో జిల్లా ప్రజలకు గుర్తులేదు: కవిత
NZB: ఎంపీ అర్వీంద్ తనపై చేసిన వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. అరవింద్ ఎవరో సగం మంది నిజామాబాద్ జిల్లా ప్రజలకే గుర్తులేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి గలవారు, ఎవరో మద్దతు ఇస్తేనే తాము గెలుస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. మరోసారి తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు