అదుపుతప్పిన ట్రాక్టర్.. బైకర్‌పై పడిన గడ్డివాములోడు

అదుపుతప్పిన ట్రాక్టర్.. బైకర్‌పై పడిన గడ్డివాములోడు

TG: నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని చౌరస్తా వద్ద గడ్డివాములోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.