తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: ఫరూక్

NDL: ఎన్ఎండీ ఫరూక్ నాలుగోసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనకీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి జిల్లాలో రహదారులు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వాటి మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. అదే విధంగా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కర్నూలు నుంచి నంద్యాలకు నూతన రైల్వేలైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని అన్నారు.