VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
NZB: బోధన్ పట్టణంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.