బాలిక ఫొటోలు పోస్ట్.. యువకుడిపై పోక్సో కేసు
SS: కదిరికి చెందిన బాలిక ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన యువకుడు రామాంజనేయులుపై కదిరి గ్రామీణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతడు బాలికతో చనువుగా ఉంటూ కోరిక తీర్చాలని వేధించాడు. నిరాకరించడంతో కోపంతో బాలిక ఫొటోలు పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.