రాత్రికి రాత్రే శివలింగం ప్రత్యక్షం..!
NLG: చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో శివలింగం ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. రైతు జంగం మల్లారెడ్డి పొలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించడంతో గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. గతంలో అక్కడ విగ్రహం లేదని, ఎవరో కావాలని తెచ్చి పెట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.