‘సమయానికి హాజరు కాకపోతే చర్యలు’
VSP: జీవీఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు నిర్ణీత సమయానికే విధుల్లో ఉండాలని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. సౌత్ జోన్ 41వ వార్డులో ఇవాళ ఆయన పర్యటించి పనులను పరిశీలించారు. కార్మికుల హాజరు, క్లాప్ వాహనాల పనితీరును తనిఖీ చేశారు. ఉదయం 7:30లోపు ప్రధాన రహదారులు, కాలువలు శుభ్రం చేసి చెత్తను తరలించాలని సూచించారు. దుకాణాల వద్ద డస్ట్‌బిన్లు తప్పనిసరని ఉంచాలన్నారు.