వినాయక విగ్రహాల అనుమతి తప్పనిసరి: ఎస్సై

KKD: వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై రవికుమార్ సూచించారు. మండల కేంద్రమైన సింహాద్రిపురంలోని పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో.. మాట్లాడుతూ.. వినాయక విగ్రహాలను ఎన్ని రోజులు నిలబెడతారు. ఏ ఏ స్థలాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనాలకు తరలిస్తారు. తదితర అంశాలను తెలపాలన్నారు. వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.