"కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలి"
MLG: గోవిందరావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లావుడియా జోగా నాయక్ సోమవారం గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. మంత్రి సీతక్క అండతో గ్రామానికి భారీ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని, 80 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించానని, గత బీఆర్ఎస్ పాలనలో ఏమీ చేయలేదని విమర్శించారు. “కత్తెర గుర్తు”కు ఓటేసి గెలిపించాలని కోరారు.