బ్యాంక్‌లో కోట్ల అవినీతి.. చీఫ్ మేనేజర్ సస్పెన్షన్
AP: పల్నాడు జిల్లా గురజాల సహకార బ్యాంకులో(GDCC) గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.11.66 కోట్ల అవినీతిపై అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసి, నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో చీఫ్ మేనేజర్ పున్నారావును కలెక్టర్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ విచారణలో నిధుల మళ్లింపు వాస్తవమని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.